కాజల్ కు ఝలక్ ఇచ్చిన దర్శకుడు శంకర్!

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. అయితే ఈ సినిమాలో ముందు నుంచి ఫిమేల్ లీడ్ రోలులో కాజల్ అగర్వాల్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ శంకర్ బాంబు పేల్చారు. కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు-2’ సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్య క్రమంలో వెల్లడించారు. ‘భారతీయుడు-2’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు కాజల్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తీరా విడుదలకు ముందు దర్శకుడు ఈ ప్రకటన చేయడంతో ఈ విషయం ఆమెకు తెలుసా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది జూన్12, 2024న లో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version