మంత్రి జ‌గ‌దీష్‌కు సంచ‌ల‌న స‌వాలు విసిరిన కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌

-

తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డ విన్నా ‘హుజురాబాద్ ఉప ఎన్నిక’పైనే చ‌ర్చ న‌డుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించి మరీ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తోంది. రాష్ట్ర మంత్రుల పర్యటనలతో నియోజకవర్గం క‌ళ‌క‌ల‌లాడుతోంది. స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి ‘దళిత బంధు’ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారంటే ఆ ఉప ఎన్నిక ఎంత కీల‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ద‌ళిత బందు అమ‌లు, తీరుతెన్న‌ల గురించి ఓ గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి సంభాషించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంతుతుంద‌ని ఆశ ప‌డుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాల‌ని పోస్టులు పెడుతున్నారు జనాలు.కాగా, భువనగిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తే తాము కూడా రాజీనామా చేస్తాన‌ని, అంతేగాకుండా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేత కూడా రాజీనామా చేయిస్తానని ఎంపీ కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

 ఈ సవాల్ ను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వీకరించాలని వారు కోరారు. ఇకపోతే జిల్లాలో రాజకీయం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంది. అంతేగాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రి జగదీశ్ రెడ్డి‌కి మధ్య రాజకీయ వైరం ఎప్ప‌టి నుంచో కొనసాగుతూనే ఉంది. ఆ దూరం ఈ మ‌ధ్య ఎక్కువైంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌కు ఎంత వైరం ఉందో ఈ మ‌ధ్య మ‌ళ్లీ బ‌య‌ట ప‌డింది. ఓ కార్యక్రమంలో వీరిరువురు పాల్గొనగా, మాట్లాతున్న క్రమంలో మంత్రి జగదీశ్ మైక్‌ను రాజగోపాల్‌రెడ్డి కోపంగా లాక్కున్నారు. దాంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ మొద‌లైంది. పోలీసులు రంగంలోకి దిగి గొడవలు సద్దుమణిగించారు. అయితే, మొదటి నుంచే కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి జగదీశ్‌కు మధ్య గొడ‌వ‌లు ఉన్నాయి. వారి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే మండుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version