పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల : ఇలా చెక్ చేసుకోండి

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తొమ్మిదవ విడత డబ్బులను విడుదల చేసింది. ఈ నిధులను కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.75 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 19, 500 కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ పథకం ప్రకారం ఒక్కో రైతు ఖాతాలో ఏకంగా రెండు వేల రూపాయలు జమ కానున్నాయి. ఈ డబ్బులతో … ఎరువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా ఈ పీఎం కిసాన్ సల్మాన్ నిధి తొమ్మిదో విడత డబ్బులు మీ ఖాతా లో పడ్డాయో లేదో ఇలా తెలుసుకోండి. PMKishan.gov.in సైట్ ఓపెన్ చేయాలి. అందులో బెని ఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన అనంతరం అందులో ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంటు నెంబరు, మొబైల్ నెంబర్ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేయగానే ఆయా రైతు యొక్క సమాచారాన్ని మనకు చూపిస్తుంది. పి ఎం ఎం కిసాన్ సమ్మాన్ నిధి… ఎప్పుడు పడ్డాయి ఇంతవరకు ఎన్ని సార్లు జమ అయ్యాయి అనే పూర్తి వివరాలు అందులో మనకు కనిపిస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 8 విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ప్రకారం రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు మూడు విడతల్లో ఇస్తోంది.

పీఎం కిసాన్‌ చెక్ చేసుకోండిలా
పీఎం కిసాన్‌ డబ్బులు అందలేదా…? అయితే ఇలా చెయ్యండి…!
పీఎం కిసాన్‌ లబ్దిదారుల కోసమే ఈ యాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version