జీవోల‌ను ర‌ద్దు చేస్తునే ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు : తెల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లకు వెళ్ల‌కూడ‌ద‌ని ఉద్యోగ సంఘాలు నిర్ణ‌యించాయి. పీఆర్సీకి సంబంధించిన జీవోల‌ను ర‌ద్దు చేస్తేనే రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లకు వ‌స్తామ‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు తెల్చి చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల కూడా ఉద్యోగుల బాధ‌ను అర్థం చేసుకోవాల‌ని పీఆర్సీ సాధ‌న సమితి నాయ‌కులు విజ్ఞాప్తి చేశారు. కాగ ఈ రోజు ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది.

అయితే ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు వెళ్లాలా వ‌ద్దా అని విజ‌య‌వాడ ఎన్జీవో హొంలో ఉద్యోగ సంఘాల నాయ‌కులు భేటీ అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం పీఆర్సీ విడుద‌ల చేసి.. దానికి సంబంధించిన జీవోల‌నూ జారీ చేసి చ‌ర్చ‌ల‌కు ఇప్పుడు ఎలా ఆహ్వానిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. పీఆర్సీ కి సంబంధించిన జీవోల‌ను అన్నింటినీ ర‌ద్దు చేసిన త‌ర్వాతే.. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాగ త‌మ డిమాండ్లు నేర వేరే వ‌ర‌కు త‌మ ఉద్యమం ఆపేది లేద‌ని తెల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version