పవన్ కళ్యాణ్, షర్మిలా మాదిరిగా తీన్మార్ మల్లన్న వచ్చాడు : కే.ఏ.పాల్

-

ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్, షర్మిల లాగా కొత్తగ తీన్మార్ మల్లన్న అని చిన్నోడు వచ్చాడు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. “నేను బీసీని అనే ఆర్కెస్ట్రాతో మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు బీసీలకు నేను ఉన్నాను.. నేను చిరంజీవి లాగా కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ లాగా బీజేపీకి అమ్ముడు పోను” అని కేఏ పాల్ పేర్కొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్యాకేజీ స్టార్ల మాదిరిగా చిన్నోడు తీన్మార్ మల్లన్న బీసీ నేత ఆర్. కృష్ణయ్యతో రూ.80కోట్లు ఖర్చు చేసి నిన్న మీటింగ్ పెట్టి.. మన బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్. కృష్ణయ్య మేము బిచ్చగాళ్లమా బిచ్చగాళ్లమా అన్నాడు. చంద్రబాబుతో బిచ్చం అడిగే.. జగన్ తో బిచ్చం అడిగాడు.. కేసీఆర్ ని బిచ్చం అడిగాడు. ఇప్పుడు బీజేపీని బిచ్చం అడిగి బీసీని తాకట్టు పెట్టాడు. ఆర్. కృష్ణయ్య శిష్యుడే తీన్మార్ మల్లన్న అని సంచలన వ్యాఖ్యలు చేశారు కే.ఏ.పాల్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version