రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకక్కిన దిశ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఏడాది నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా మానభంగానికి గురయి అసువులు బాసిన దిశ కథతో రాం గోపాల్ వర్మ శిష్యుడు ఎన్కౌంటర్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా మీద ఇప్పుడు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కూతుర్ని పోగొట్టుకుని ఉన్న తమ మీద కక్ష గట్టినట్టు ఈ సినిమా తీసినట్టు ఉందని వర్మ మీద దిశ తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా బయటకు రాకుండా చేసేందుకు సుప్రీం కూడా వెళుతున్నామని ఆయన పేర్కొన్నాడు.
దిశ కథతో రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమా పై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశామని, యూట్యూబ్ లో విడుదల చేసిన ట్రైలర్ ను తొలగించడంతో పాటు సినిమా విడుదల ఆపాలంటూ పిటీషన్ వేశామని అన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్, సెన్సార్ బోర్డుకి ఈ సినిమా పై పలు సూచనలు చేసిందన్న ఆయన దీంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ లో మరోసారి పిటీషన్ దాఖలు చేశామని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోవడానికి సుప్రింకోర్టు వరకు వెళ్తామని ఆయన అన్నారు. ఒకవేళ సినిమాను రిలీజ్ చేస్తే ఆర్జీవి పై పరువు నష్టం దావా వేస్తానని అయన హెచ్చరించారు.