“డిస్నీ + హాట్ స్టార్” ఓటిటి వాడే వారికి బిగ్ షాక్ … !

-

కరోనా వచ్చిన సమయం నుండి ఓ టి టి ఛానెళ్ల హవా ఎక్కువ అయింది. థియేటర్ లకు వెళ్లి వందల వందలు ఖర్చు చేయలేక నాలుగు గోడల మధ్యన ఇంట్లోనే హాయిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఆలా వచ్చినదే డిసెయ్ + హాట్ స్టార్.. కాగా ఇప్పుడు హాట్ స్టార్ కొత్త రకమైన నిబందహనాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు ఒక హాట్ స్టార్ ఖాతాదారుడు పాస్ వర్డ్ ను ఫ్రెండ్స్ కు షేర్ చేయడం ద్వారా పది మంది డివైజ్ ల వరకు వీక్షించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని కట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం. కొత్తగా తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై కేవలం ఒక ఖాతాదారుడి నుండి నలుగురు మాత్రమే షేర్ చేసుకోగలరు.

ఈ కొత్త నిబంధన ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇండియాలో ఉన్న ఓ టి టి ఛానెళ్లలో ఒక్క హాట్ స్టార్ 38 శాతం సబ్స్క్రైబర్ లను కల్గి ఉండడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version