టీ 20 వరల్డ్ కప్ కు “పపువా న్యూ గినియా” … !

-

క్రికెట్ వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించాలన్నది ప్రతి ఒక్క దేశానికి కలలా ఉంటుంది. కానీ కొన్ని దేశాలు మాత్రమే ఈ కళను నిజం చేసుకుంటూ ఉంటాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం క్రికెట్ ఆడుతున్న ఒక చిన్న దేశం వరల్డ్ క్యూలో కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల కొన్ని రోజుల నుండి క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతుండగా ఇప్పటికే ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ దేశాలు 2024 లో వెస్ట్ ఇండీస్ మరియు అమెరికా లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. ఇక తాజాగా పిలిప్పీన్స్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించి మొదటిసారిగా వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా పరుగులు 229 చేయగా, ఫిలిప్పీన్స్ కేవలం 129 పరుగులు చేసి ఓటమి పాలయింది.

ఇంకా మరో స్థానాలు ఈ వరల్డ్ కప్ ఆడడానికి ఖాళీలు ఉన్నాయి. మరి ఈ వరల్డ్ కప్ ను ఆడడానికి ఇంకా నాలుగు జట్లు ఏవి కానున్నాయి అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version