విశాఖ : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ నెల 28 నుంచి ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రకటన చేశారు. ఈనెల 28 న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.
పేదలకు లక్ష 30వేల పట్టాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. టీడీపీ రాజకీయాల వల్లే పేదలకు జరగాల్సిన మేలు ఆలస్యం అయిందని… అర్బన్ హౌసింగ్ ఓ చరిత్ర అన్నారు మంత్రి జోగి రమేష్.
ఈ నెల 28న రెండవ విడతగా1.5 లక్షల మహిళలకు ఇళ్ళ మంజూరు చేసినట్లు వెల్లడించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. పేదల ఇళ్ళపై కొందరు కోర్టులకు వెళ్ళారని.. దేవుడి ఆశీస్సులతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అందరికీ సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.