సునితా విలియమ్స్ రాకకు మళ్లీ బ్రేక్..!

-

నాసా వ్యోమగామా సునితా విలియమ్స్ రాక మరోసారి వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో భూమి మీదకు తిరిగి రావడం ఆలస్యం కాబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్ లో నలుగురు వ్యోమగాముల సిబ్బంది ఉన్నారు. ఈ వ్యోమగాములు.. సునీతా విలియమ్స్.. బుచ్ విల్మోర్ లను భర్తీ చేయనున్నారు. కానీ హైడ్రాలిక్ సిస్టమ్ సమస్య కారణంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. దీంతో మరిన్నీ రోజులు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది.

నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. బయలుదేరే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య తలెత్తడంతో ఆపేసినట్టు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి వారంలో మరో ప్రయోగం చేయనున్నట్టు తెలిపింది. దీంతో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version