కృష్ణా జ‌లాల పంప‌కం.. ఏపీకి 21, తెలంగాణ‌కు 92 టీఎంసీలు

-

కృష్ణా జాల‌ల కోటాను రెండు తెలుగు రాష్ట్రాల‌కు కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు కేటాయించింది. ఈ కేటాయింపుల‌ల్లో తెలంగాణ రాష్ట్రానికి 92 టీఎంసీలు రాగా.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి 21 టీఎంసీల‌ను కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు కేటాయించింది. కాగ శ్రీశైలం ప్రాజెక్టు నీటి మ‌ట్టం బాగా త‌గ్గ‌డంతో నాగ‌ర్జున సాగ‌ర్ నుంచి రివ‌ర్స్ పంపింగ్ జాల‌ల‌ను తాగు నీటి అవ‌స‌రాల కోసం వినియోగించు కోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు సూచించింది.

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ కు కూడా నీటి వినియోగం పై పలు సూచ‌న‌లు చేసింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు కృష్ణా న‌ది జలాల‌ను తెలంగాణ రాష్ట్రం 232 టీఎంసీలు వాడుకుంద‌ని కేఆర్ఎంబీ తెలిపింది. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం 608 టీఎంసీలు వాడుకుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే ప్ర‌స్తుతం శ్రీశైలంలో నీటి మ‌ట్టం త‌గ్గడంతో ఇప్పుడు కేవ‌లం 113 టీఎంసీలు మాత్ర‌మే ఉన్నాయని కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు ప్ర‌క‌టించింది. దీనిలో నుంచి రెండు రాష్ట్రాల‌కు కోటా లా వారిగా కేటాయించామ‌ని ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version