సీఎం చేతులమీదుగా రాజీవ్ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ..

-

గతంలో సీఎం రేవంత్ ప్రకటించిన విధించిన సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభయ హస్తం పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆదివారం ఉదయం ఆర్థిక సాయం అందజేశారు.

కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, ఇతర ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్స్ అభ్యర్థులకు చదువు దూరం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ కోచింగ్, పుస్తకాలు, అకామడేషన్ కోసం ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులను గుర్తించి ప్రభుత్వం రాజీవ్ అభయ హస్తం పేరిట ఈ ఆర్థికసాయాన్ని అందిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news