విశాఖలో దీర్ఘకాలిక రోగాలకు తయారుకానున్న దివ్యఔషధం.. ఇక చింతక్కర్లా..!

-

దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్‌, షుగర్‌, గుండెజబ్బులు, రక్తపోటు, హెచ్ఐవీకు దివ్య ఔషధ మొక్కలను మన ఆంధ్రప్రదేశ్‌లోనే విరివిగా పెరుగుతున్నాయట. సముద్రతీరంలో ఈ మొక్కలకు సంబంధించి మొత్తం 49 ప్రాంతాలను గుర్తించారు. వీటి ప్రయోజనాలు ఏంటి, ఈ మొక్కల పేరేంటో మీరూ చూడండి..!

ఈ మొక్క. పేరు సీవీడ్‌..మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ అధికమవుతున్న నేపథ్యంలో సీవీడ్‌ ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (CIFT).. సీవీడ్స్‌తో వైవిధ్య ఆహార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, వినియోగం పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. మ్యాక్రో ఆల్గేగా పిలిచే ఈ సీవీడ్‌ మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో విరివిగా లభిస్తోందని వీళ్లు గుర్తించారు..ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సీవీడ్‌తో సూప్‌లు, నూడుల్స్, పాస్తాల్లో పొడి, రోల్‌ రూపంలో తినడానికి వీలుగా తయారుచేస్తున్నారు. అలాగే బిస్కెట్లు/కుకీస్, డ్రింకులు, నూట్రియెంట్‌ బార్స్, బ్రెడ్లు, సాచెట్లు వంటి వాటి తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిని తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని విశాఖ ఐకార్‌–సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

వందకు పైగా రకాలు..

సీవీడ్‌లో ఎరుపు, గోదుమ, ఆకుపచ్చ రంగుల్లో తినడానికి వీలుగా 221 రకాల జాతులున్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిలో సోడియం, కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి. సీవీడ్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉండడంతో వాటితో తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హెచ్‌ఐవీ, కోవిడ్‌ వంటివి నియంత్రణలో ఉంటాయని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సీవీడ్‌ సముద్రంలో సహజసిద్ధంగానే పెరుగుతుంది. అయితే కృత్రిమంగానూ పెంచవచ్చు. ఇలా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వీటి పెంపకాన్ని చేపట్టారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వరకు.. అలల తీవ్రత, లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతం సీవీడ్‌ పెంపకానికి అనుకూలం.

ఏపీలో ఇక్కడే..

ఆంధ్రప్రదేశ్‌లో 49 ప్రాంతాల్లో తీరానికి ఆనుకుని సముద్రంలో 1,215 హెక్టార్లు సీవీడ్‌ పెంపకానికి అనువుగా ఉందని గుర్తించారు. విశాఖ తీర ప్రాంత పరిసరాల్లో రెడ్, బ్రౌన్‌లకంటే గ్రీన్‌ సీవీడ్‌ ఎక్కువగా లభిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్కే బీచ్‌ దగ్గర 40, ఉడా పార్క్‌ దగ్గర 10, తెన్నేటి పార్క్‌ దగ్గర 50, తొట్లకొండ దగ్గర 25, భీమిలి దగ్గర 25, తిమ్మాపురం దగ్గర 50, మంగమారిపేట దగ్గర 50, ఎండాడ దగ్గర 25, ముత్యాలమ్మపాలెం దగ్గర 25, పూడిమడక దగ్గర 50, బంగారమ్మపాలెం 25, రాంబిల్లి వద్ద 25 వెరసి 400 హెక్టార్లు అనుకూలంగా ఉన్నట్టు తేల్చారు. అలాగే విజయనగరం జిల్లాలో 165, శ్రీకాకుళంలో 75 ప్రాంతాలు అనువుగా ఉన్నాయి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version