మజిలీ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్న దివ్యాన్ష కౌశిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఈమె బాగా నటించినప్పటికీ పూర్తిస్థాయిలో మార్కులు సమంతా కొట్టేసిందనే చెప్పాలి. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మరొక హీరోయిన్ రజీషా విజయన్ కూడా నటిస్తున్నారు.
ఇకపోతే జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శర వేగంగా జరుపుకుంటున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే దివ్యాన్ష కౌశిక్ విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ఆమె మాట్లాడుతూ మజిలీ సినిమా తర్వాత కరోనా రావడంతో చాలాకాలం గ్యాప్ వచ్చింది . ఇక ఈ గ్యాప్ లోనే నేను కొన్ని యాక్టింగ్ క్లాసులు అలాగే డాన్స్ క్లాసులు కూడా తెలుగులో తీసుకున్నాను. ముఖ్యంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది.
ఇక నాగచైతన్యతో అలాగే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ తో వర్క్ చేయడం ఎలా ఉంది అని ఆమెను ప్రశ్నించగా ..డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని షూటింగ్ సెట్లో రవితేజ చాలా యాక్టివ్ గా ఉంటే నాగచైతన్య చాలా కూల్ గా, కామ్ గా ఉంటాడు అని ఇద్దరిలో ఒకటే కామన్ క్వాలిటీ ఉంది అని, ఇద్దరు కూడా సెట్స్ లో చాలా సరదాగా నవ్వుతూ ఫ్రాంక్ చేస్తూ ఉంటారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఫన్ క్రియేట్ చేయడంలో రవితేజ లాంటి వాడే చైతూ కూడా అంటూ తన మనసులో మాటను తెలిపింది దివ్యాన్ష కౌశిక్.