సుపారీ ఎపిసోడ్ అంతా చూస్తుంటే.. బీజేపీ నాయకులను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. స్టీఫెన్ రవీంద్ర ఓ స్టోరీ క్రియేట్ చేసి.. ఓ స్క్రిప్ట్ ను చదువుతున్నట్లు ఉందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఆయన ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ గౌడ్ క్రియేట్ చేసిన స్టోరీ అని ఆమె ఆరోపించారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని.. ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆమె విమర్శించారు.
రూ. 15 కోట్లు సుపారీ ఇచ్చే శక్తి టీఆర్ఎస్ నాయకులకే ఉంది… డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
-