పిల్లల్ని పెంచే క్రమంలో పెద్దవాళ్లు చాలా తప్పులను చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల తప్పులు చేయడం వలన సైకియార్టిస్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎంతో ఇబ్బంది ఉంటుంది. స్కూల్ కి వెళ్లే వరకు పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా పెంచితే పిల్లల ప్రవర్తన అంతా బాగుంటుంది. మూడేళ్ల వయసులో పిల్లల్ని స్కూల్లో చేరుస్తారు. అప్పటి వరకు కూడా తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. మంచి ప్రవర్తనని అలవాటు చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారు దాని వలన మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది.
వర్చువల్ ఆటిజం కలుగుతుంది. సెల్ ఫోన్ కి అలవాటు పడ్డ పిల్లలకి మాటలు సరిగ్గా రావు. కోపం చికాకు అసహనం తిరుగుబాటు ధోరణి వంటివి కలుగుతాయి. సైకియార్టిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళ ఖర్చుపెట్టినా ఒక్కోసారి ఫలితం ఉండదు. కాబట్టి ఈ తప్పుని అసలు తల్లిదండ్రులు చేయకూడదు. పిల్లలకి మంచి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. పిజ్జా బర్గర్ ప్యాకెట్లలో ఉండే చిప్స్ వంటివి ఇస్తే పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుంది.
దానికి బదులుగా మీరు ఆరోగ్యకరమైన స్నాక్స్ ని మాత్రమే ఇవ్వాలి. పిల్లలు ఆకలి వేస్తే అన్నం తింటారు. ఆకలి లేకపోతే బలవంతంగా వాళ్ళకి పెట్టకండి పిల్లలు ఏదైనా ఆహార పదార్థాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినేలా మీరు ప్రోత్సహించాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఓర్పు కావాలి జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి మూడేళ్లు లోపు పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు పెద్దలు వాళ్ళ చుట్టూ ఉండాలి.
అలాంటప్పుడు పిల్లలు ఎదుగుదల బాగుంటుంది వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి. తల్లి ఒక్కరే పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది ఎక్కువగా పిల్లల్ని బయటకు తీసుకు వెళ్తూ ఉండాలి. ఆకాశం చందమామ నక్షత్రాలు పక్షులు ఇటువంటివన్నీ చూపిస్తూ ఉండాలి. ఇంట్లోనే పిల్లల్ని అలా బంధించకూడదు. కథలు చెప్పండి, పాటలు పాడండి, బొమ్మలతో ఆడించండి. రాత్రి పూట జోల పాటలు పాడండి, కథలు చెప్పండి ఇలా పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. శారీరకంగా మానసికంగా కూడా వాళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు ఆనందంగా ఉంటారు. కాబట్టి మూడేళ్లలోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ తప్పులను చేయకుండా చూసుకోండి.