మంచి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే తీసుకునే ఆహారం తో పాటుగా నిద్ర కూడా ఎంతో ముఖ్యం చాలా మంది రాత్రిపూట తీసుకునే ఆహారం విషయం లో తప్పులు చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు చేయడం వలన నిద్ర పట్టదు.
చాలా మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పండ్ల ని తింటూ ఉంటారు కొన్ని రకాల పండ్లను రాత్రిపూట తీసుకుంటే ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి. రాత్రిపూట నిద్రపోయే ముందు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఏ సమస్యలను ఎదుర్కోవాలి అనే విషయాన్ని చూద్దాం.
రాత్రిపూట టమాటా ని అసలు తీసుకోకూడదు దీని వలన ప్రమాదమే తప్ప ప్రయోజనం ఉండదు.
అలానే ఆరెంజ్ కూడా రాత్రి తీసుకోవద్దు ఇది కూడా మంచి నిద్రని అందివ్వదు.
ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ని కూడా రాత్రిపూట అసలు తీసుకోకండి. ద్రాక్ష పండ్లను కూడా రాత్రిపూట అసలు తీసుకోవద్దు. ఇవి కూడా మంచిది కాదు.
ఆపిల్ ని కూడా నిద్రపోయే ముందు తీసుకోకండి.
సపోటా అరటిపండు కూడా రాత్రి పూట తీసుకోవద్దు. వీటిని మీరు రాత్రి తీసుకుంటే నిద్ర పట్టదు సరి కదా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.