చికెన్ తో పొరపాటున కూడా వీటిని తీసుకోకండి.. లేదంటే అంతే సంగతులు..!

-

చాలా మంది చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం పైన సరిగ్గా దృష్టిపెట్టాలి. తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేసినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది చికెన్ ని తింటూ ఉంటారు.

 

అయితే చికెన్ ని తినేటప్పుడు వీటిని అస్సలు తినకూడదు. అయితే మరి చికెన్ తో పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు…?, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

చేపలు:

సాధారణంగా చికెన్, చేపలు ఇటువంటివన్నీ కూడా మనకి భోజనం లో పెడుతూ ఉంటారు. అయితే చికెన్ తీసుకునేటప్పుడు చేపలతో పాటు తినకూడదు. ఎందుకంటే చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. చేపలలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ మరియు చేపని ఒకేసారి తీసుకోవడం వల్ల శరీరంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రెండింటినీ కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు.

పెరుగు:

పెరుగు తో చాలా రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే చికెన్తో పాటు పెరుగును తీసుకోవడం మంచిది కాదు. చికెన్ తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల చల్లగా ఉంటుంది. ఒకేసారి చికెన్ మరియు పెరుగును తీసుకునేటప్పుడు వేడి మరియు చల్లదనం రెండు ఒకేసారి అందుతుంది. దీని వలన నెగటివ్ ప్రభావం పడుతుంది.

పాలు:

పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలతో పాటు మీరు చికెన్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే విషం తీసుకున్నట్లే కాబట్టి అసలు చికెన్ తో పాలను కూడా తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version