సాధారణంగా ఎవరి వాహనాల మీద వాళ్ళు వాళ్లకి నచ్చిన పేర్లని రాయించుకుంటూ ఉంటారు. అయితే మీకు వెహికల్ ఉందా? తప్పక దీని కోసం తెలుసుకోవాలి. వాహనాల మీద ఇష్టం వచ్చినట్టు రాస్తే కనక షాక్ తప్పదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇష్టమొచ్చిన పేర్లను వెహికల్ మీద రాయిస్తే మాత్రం మీకు షాక్ తప్పదు అని హెచ్చరిస్తున్నారు. వాహనాల పై కులం వంటి పేర్లు రాస్తే జరిమానా పడుతుంది.
ఇంకా వెహికల్ సీజ్ కూడా చేస్తారట. చాల మంది తమ వెహికిల్స్ పైన ఎదో ఒకటి రాస్తూనే ఉంటారు. కులాల పేర్లు వెహికల్స్ మీద రాస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు అని స్పష్టంగా చెప్పేసారు. ఉత్తర ప్రదేశ్ లో ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. పైగా దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వాహనాలపై కనక కులం పేరు రాస్తే శిక్ష పడుతుంది అని చెప్పారు.
కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వెహికల్ పై కులం పేరు రాస్తే జరిమానా పడుతుంది అని అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఇలా క్యాస్ట్ పేరు రాస్తే జరిమానా పడడం తో పాటు… వెహికల్ నెంబర్ ప్లేట్ పై కూడా ఏమైనా రాస్తే అప్పుడు కూడా జరిమానా పడుతుందన్నారు. కులం పేరు కనుక రాస్తే జరిమానా మాత్రమే కాదు వెహికల్‌ను సీజ్ కూడా చేసేస్తారని గమనించడం. కాబట్టి ఇటువంటి వాటిని కనుక మీ వాహనం పై వున్నట్లయితే వీటిని తొలగించడం మంచిది.