తెలుగు మహాసభల్లో సీఎం పేరు చెప్పకపోవడం వెనక ఎదో కుట్ర ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డారు. అసలు ఎవడయ్యా తెలుగు మహాసభలు పెట్టిందని ప్రశ్నించారు. తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా.. యాంకర్ కి చదువు రాదా..? యాంకరింగ్ చేసేటోళ్లకు ముఖ్యమంత్రి తెలవకుండా యాంకర్ అవుతాడా..? అని ప్రశ్నించారు.
చిన్న చిన్న దాంట్లను ఇలా కాగితం పై రాసుకుంటూ చదువుతున్నాం. ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిండో తెలియకుండా చదువుతాడా..? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని తనకు అనిపిస్తుందని తెలిపారు.