మార్చి 31 లోగా ఈ 5 పనులని తప్పక చెయ్యండి…. లేదంటే నష్టపోవాల్సిందే..!

-

ఆదాయపు పన్ను చెల్లించే వారికి మార్చి నెల ఎంతో ముఖ్యమైనది. మర్చి నెల తో ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యి పోతుంది. చాలా మంది ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పన్ను మినహాయింపులు కల్పించే పెట్టుబడుల కోసం చూస్తారు. అలానే ప్రభుత్వం పలు రకాల సేవలకు మార్చి 31 గడువు విధించింది. గడువు లోగా పూర్తి చేసుకోవాల్సిన పనులని తప్పక చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాలి. పాన్ కార్డుతో ఆధార్ లింక్ మొదలు మరి కొన్ని పనులని మార్చి 31 లోగా పూర్తి చేసుకోవాలి. ఇక మరి పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం.

 

పాన్-ఆధార్ లింక్ చెయ్యండి:

మార్చి 31తో దీనికి గడువు ముగుస్తుంది. కనుక మీ పాన్ ఆధార్ ని ఆ లోగా లింక్ చేసేయండి. ఇప్పుడే పాన్ ఆధార్ లింక్ చేయని వారు ఆలస్య రుసుము చెల్లించాల్సి వుంది.

పీఎం వయా వందన యోజన స్కీమ్:’

పీఎం వయా వందన యోజన స్కీమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ స్కీమ్ తో తక్కువ రిస్క్, ఎక్కువ ఆదాయం. ఈ పథకం లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వాళ్లకి ఇది చివరి అవకాశం. 60 ఏళ్ల వారికి ప్రయోజనాలు ఈ స్కీమ్ అందిస్తోంది. మార్చి 31, 2023 తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు.

ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడి:

2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన ఒకటి చేసారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం పాలసీలకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని తొలగిస్తున్నారని చెప్పారు. ఏప్రిల్ 1, 2023 నుంచి చేసే ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది అవుతుంది. రూ.5 లక్షలకు పైగా ప్రీమియం ఉండే పాలసీలు చేయాలనుకుంటే మార్చి 31లోపే చెయ్యడం మంచిది.

ట్యాక్స్ ప్లానింగ్:

ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మార్చి 31లోపు పెట్టుబడి పెట్టిన వాటికే వర్తిస్తుంది.

మ్యూచువల్ ఫండ్ స్కీమ్:

నామినేషన్ పూర్తి చేయాలంటే మార్చి 31లోపు పూర్తి చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version