పిల్లల్లో ఐక్యూ ని పెంచాలనుకుంటే.. ఇలా చేయండి..!

-

పిల్లలు తెలివైన వాళ్ళై ఉండాలని, బాగా చదువుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశ పడుతూ ఉంటారు. పిల్లల్లో ఐక్యూని పెంచాలంటే వీటిని ఫాలో అవ్వడం మంచిది. ఐక్యూ స్థాయిలని పెంచడానికి రెగ్యులర్ గా చదవాలి. ప్రతి రోజు కూడా వాళ్ల చేత పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదివిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఐక్యూ పెరుగుతుంది. అలాగే పజిల్ గేమ్స్ ఎక్కువగా ఆడడంతో పిల్లల్లో ఐక్యూ పెరుగుతుంది. సుడోకు, క్రాస్ వర్డ్ ఇటువంటివి ఆడించండి. దీని వలన వాళ్లలో స్కిల్స్ పెరుగుతాయి అలాగే పిల్లలు చేత వ్యాయామం చేయించండి. క్రమం తప్పకుండా పిల్లలు వ్యాయామం చేయడం వలన మెదడు ఆరోగ్యం బాగుండడమే కాకుండా శారీరక వ్యాయామం అవుతుంది.

మెదడుకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి.. ఐక్యూని పెంచుకోవడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజు పిల్లలు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేటట్టు చూడండి. నిద్రపోవడం వలన ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి. పిల్లల చేత ప్రతిరోజు ఒక స్కిల్ నేర్పించండి. ఇలా చేయడం వలన కూడా ఐక్యూని పెంచుకోవచ్చు. రోజూ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక సమస్యలు నయమవుతాయి. ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

ఫోకస్ ని పెంచుకోవడానికి అవుతుంది. పిల్లలు మంచి విషయాలు గురించి ఎవరితోనైనా మాట్లాడితే కూడా ఐక్యూని పెంచుకోవడానికి అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ని పిల్లలకు నేర్పించండి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఒక పద్దతి ప్రకారం పూర్తి చేయాలి. ఇలా పద్ధతి ప్రకారం ఫాలో అయితే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రతిదీ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల చేత ఇటువంటివి ఫాలో అయ్యేటట్టు చేస్తే ఖచ్చితంగా పిల్లలు మంచి నిర్ణయాలను తీసుకోవడంతో పాటుగా ఐక్యూని పెంచుకోవడం, క్రమశిక్షణ ఇవన్నీ అలవాటు అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version