బియ్యం పాడవకుండా.. నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!

-

మనం ఎక్కువ బియ్యాన్ని తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. బియ్యం ఒక్కొక్కసారి పురుగులు పట్టి పాడయ్యే అవకాశం ఉంది అయితే బియ్యం పాడైపోకుండా పురుగులు వంటివి ఏమీ కూడా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇలా చేయడం వలన బియ్యం నిల్వ ఉంటాయి పురుగులు వంటివి ఏమీ కూడా పట్టవు. బియ్యాన్ని స్టోర్ చేసేటప్పుడు గట్టిగా గాలి వెళ్ళని డబ్బాలో మీరు స్టోర్ చేసుకోండి గాలి తగిలేలా మీరు వదిలేసారంటే గాలిలోనే బ్యాక్టీరియా బియ్యం మీద వాలుతుంది. కాబట్టి గట్టిగా డబ్బాలో పెట్టుకోండి.

 

బియ్యాన్ని నిల్వ ఉంచాలంటే ఎండలో పెడితే కూడా నిల్వ ఉంటాయి బియ్యం ఆరితే పురుగులు వంటివి చేరవు. బియ్యం లో పురుగులు ఉంటే ఎండ వల్ల పురుగులు గుడ్లు వంటివి చనిపోతాయి బియ్యాన్ని ఎప్పుడు విడిగా స్టోర్ చేసుకోండి. ఇతర పప్పు దినుసులతో పాటు పెట్టకండి. ఏసీ గదిలో బియ్యాన్ని పెట్టకండి తడి ఉంటే ప్రదేశంలో బియ్యాన్ని పెడితే పురుగులు వంటివి పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది.

పొడిగా ఉండే చోటును మాత్రమే బియ్యాన్ని స్టోర్ చేసుకోవాలి. బాగా ఎక్కువ బియ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి ఎంత కావాలో అంత మాత్రమే తెచ్చుకోండి ఒక బ్యాగ్ తెచ్చుకుని అది పూర్తి అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోండి. బియ్యం లో కొన్ని లవంగాలను వేస్తే ఆ ఘాటుకి పురుగులు వంటివి చేరవు. బియ్యాన్ని కొనేటప్పుడు పాత బియ్యం కొనండి ఈ టిప్స్ ని పాటిస్తే బియ్యానికి పురుగులు వంటివి పట్టవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version