వికారాబాద్ లో భారీ వర్షం.. మోమిన్ పేట ఆర్ఓబీ వద్ద చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

-

వికారాబాద్ జిల్లాలో వర్షం భారీగా కురిసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని  మోమిన్ పేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దీంతో  ఆర్టీసీ బస్సు నుంచి ప్రయాణీకులను బయటకు తీశారు. రెండు రోజులుగా  వికారాబాద్ జిల్లాలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మోమిన్ పేట రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వర్షం నీరు చేరింది. అయితే వర్షం నీటి నుంచి అవతలికి వెళ్లేందుకు  బస్సును ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. 

అయితే వర్షం నీరు  ఎక్కువగా ఉండడంతో  ఆర్టీసీ బస్సు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులోకి వర్షం నీరు చేరింది.  దీంతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు తాళ్ల సహాయంతో బస్సు నుండి ప్రయాణీకులను బయటకు తీసుకు వచ్చారు.  గతంలో కూడ తెలుగు రాష్ట్రాల్లో  కూడ భారీ వర్షాల కారణంగా  ఆర్టీసీ బస్సులు వర్షం నీటిలో నిలిచిపోయిన ఘటనలు  చోటు చేసుకున్నాయి. 

ఈ నెల  3వ తేదీన తెలంగాణలోని  పెద్దపల్లి జిల్లాలో  ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.  గోదావరిఖనిలోని  ఫైవ్ ఇంక్లైన్  కాలనీలోని రైల్వే బ్రిడ్జిలో  వర్షం నీటిలో  ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. 20 మంది ప్రయాణీకులతో  భూపాలపల్లి నుండి గోదావరిఖనికి ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బస్సు నుండి ప్రయాణీకులను కిందకు దించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version