ఇలా చేస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..!

-

కిడ్నీ ( kidneys )సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. కిడ్నీలు శరీరం యొక్క అత్యంత సున్నితమైన అవయవం. పైగా ఇది చాలా ముఖ్యమైన అవయవం కూడా. కిడ్నీలకు ఎలాంటి వ్యాధులు రాకుండా డయాలసిస్ వరకు వెళ్లకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి. మనం తీసుకునే ఆహార పదార్థాలు, జీవనశైలి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక సమస్యలు రాకుండా జాగ్రత్త గా ఉండాలంటే వీటిని తప్పక ఫాలో అవ్వండి.

kidney

 

కూరగాయలు, పండ్లు:

ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా కిడ్న  సమస్యలు ఉన్న వాళ్ళు పొటాషియమ్ తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా ఆపిల్, బొప్పాయి బాగా సహాయం చేస్తాయి.

బీపీ ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి:

మీకు బీపీ ఉంటే రెగ్యులర్ గా బీపీని చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా డాక్టర్ సలహాలు తీసుకుని మందులు వాడండి. దీనితో కిడ్నీ సమస్యలు రాకుండా ముందు నుండి జాగ్రత్త పడొచ్చు. అదే విధంగా డయాబెటిస్ ఉన్న రోగులకు ఈ మూత్రపిండాల సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్లు కూడా జాగ్రత్త పడటం మంచిది.

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి:

వ్యాయామం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. కిడ్నీ సమస్యలు రాకుండా కూడా వ్యాయామం సహాయపడుతుంది.

ఎక్కువ నీళ్ళు తీసుకోండి:

ప్రతి రోజూ ఎక్కువ నీళ్ళు, పండ్లరసాలు తీసుకోవడం వల్ల కిడ్నీలకు చాలా మేలు కలుగుతుంది ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం వల్ల కిడ్నీలో సోడియం, యూరియా కంటెంట్ తగ్గుతుంది దీనితో కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడకుండా చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version