ఈ మధ్య కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం సమస్య వస్తోంది. అయితే పిల్లలకు ఈ ఊబకాయం సమస్య వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగోదు. కాబట్టి పిల్లలకు ఊబకాయం రాకుండా తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూద్దాం.
పోషకాహారం ఇవ్వండి:
పిల్లలకి ఎప్పుడు కూడా పోషకాహారం ఇవ్వండి. కూరగాయలు, పండ్లు, గింజలు, నట్స్ వంటివి వాళ్ళ యొక్క డైట్ లో ఉండేటట్టు తప్పక చూసుకోండి.
వ్యాయామం చేయించండి:
పిల్లల చేత చిన్న చిన్న వ్యాయామాలు చేయించడం కూడా మంచిది. ఫిజికల్ యాక్టివిటీ లేక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కనుక రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ లాంటివి చేయిస్తూ ఉండండి. వ్యాయామం చేయడం వల్ల కేలరీలు కరుగుతాయి అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆటలు ఆడించండి:
ఈ మధ్య కాలం లో పిల్లలు స్మార్ట్ ఫోన్ మరియు టీవీలకే అంకితమైపోతున్నారు కానీ ఇది నిజంగా చెడు అలవాటు. రోజుకి గంట కంటే ఎక్కువ సేపు పిల్లలకి ఫోన్, టీవీ అలవాటు చేయకండి. వీలైనంత వరకూ మామూలు ఆటలని ఆడించడం మంచిది. స్క్రీన్ కి దూరంగా ఉంటే సమస్యలు రావు.
టీవీ చూస్తూ తిననివ్వద్దు:
టీవీ ముందు కూర్చుని తినడం వల్ల ఎంత తింటున్నారో తెలియదు. దీని వల్ల కూడా ఊబకాయం సమస్య వస్తుంది.
తక్కువ ఆహారాన్ని ఇవ్వండి:
చిన్న చిన్న మీల్స్ కింద వాళ్ళకి అలవాటు చేయండి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వాళ్లకి ఆహారం ఇవ్వండి. ఇలా తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఊబకాయం సమస్య రాకుండా ఉంటుంది. అలానే ఆరోగ్యంగా వుంటారు.