ఆస్తమతో తీవ్రంగా బాధ పడే వారు ఎందరో ఉంటారు. ముఖ్యంగా చలి కాలం మరి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్హేలర్ లు, మందులు వాడటం సహజమే. ఆస్తమా శ్వాసకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య ,ఇది ఏ వయసు వారికైనా వస్తుంది. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు మరియు వంశపారపర్యం కూడా ఆస్తమా రావడానికి కారణం. ఆస్తమా వ్యాధి నయం కాదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఉపశమనం కలగవచ్చు.
ఆస్తమా నుంచి ఉపశమనం కలగాలంటే ఎక్కువగా విటమిన్ డి ఉండే ఆహారం ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలు, మాంసం, గుడ్లు, చేపలు, గుమ్మడి కాయ, మష్రూమ్స్, సోయా పాలు, గింజలు, బీన్స్ వంటి పదార్థాల లో విటమిన్ డి అధికంగా ఉంటుంది కనుక ఈ ఆహార పదార్థాలను రోజు వారి ఆహారం లో అలవాటు చేసుకోవాలి. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొన్ని నల్ల మిరియాలు, రెండు లవంగాలు 10 నుండి 15 తులసి ఆకులు తీసుకుని ఈ నీటిలో పది నిమిషాలు ఉంచాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తేనే తో కలుపుకొని తాగాలి ఇలా చేయడం వల్ల ఆస్తమా తగ్గుతుంది. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయడం లేదా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు చేయడం వల్ల ప్రయోజనం తప్పక ఉంటుంది. ఈ చిట్కా ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది.