ఆంధ్రప్రదేశ్ లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 6:30 గంటలకు మొదలైనది.. అయితే చాలా చోట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. ముందుగా నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామస్తులు పోలింగ్ కు దూరంగా ఉండాలని తీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటు వేయ కూడదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలలో పాల్గొనాలని భావించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను కావాలనే తొలగించారని వారు నిరసన తెలియజేస్తున్నారు.
మరో పక్క తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక మరో పక్క చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం కమ్మ కండ్రిగ లో టిడిపి ఆందోళనకు దిగింది. ఓటర్ స్లిప్పులు మీద ఎన్నికల గుర్తులు గీసి పంపుతున్నారు అంటూ నిరసనకు దిగింది. పోలీసులు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.