రావి చెట్టు కొమ్మతో ఇలా చేస్తే..మీ జాతకమే మారిపోతుంది..

-

మనుషులకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి..సమస్యలు శాశ్వతం కాదు..అయితే కొంతమందికి సమస్యలు ఒకటి పోతే మరో కటి వస్తూనే ఉంటాయి..వాటి నుంచి బయట పడాలంటే మాత్రం రావి చెట్టు కొమ్మలతో ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు జ్యోతిష్య పండితులు..ఆ పూజ చేయడం వల్ల కలిగే ఇబ్బందులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


అలాంటి వారి కోసం మన శాస్త్రాలు కొన్ని పరిష్కారాలను చూపిస్తున్నాయి. సమస్యల నుండి బయటపడడానికి శాస్త్రాలు చూపించిన పరిష్కారాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే పరగడుపున ఒక రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక కొమ్మను తెచ్చుకోవాలి. ఈ కొమ్మకు ఉన్న ఆకులు చక్కగా దెబ్బతినకుండా ఉండాలి. ఇలా కొమ్మను తెచ్చుకునేటప్పుడు ఒకే దగ్గర మూడు ఆకులు ఉండేలా చూసుకోవాలి.

ఇప్పుడు ఈ కొమ్మను దేవుడి మందిరం దగ్గర ఉంచి రెండు ఆకులను ముడి వేసి మూడో ఆకును ఆ ముడి నుండి బయటకు తీయాలి. ఇలా చేసిన తరువాత మన ఇష్ట దైవానికి పూజ చేసి మనం ఎందుకోసమైతే ఈ కార్యాన్ని తలపెట్టామో ఆ పనిని మనసులో అనుకుని ఈ కొమ్మను ఎవరూ తిరగని ప్రదేశంలో, చీపురు తగలని ప్రదేశంలో లేదా ఒక చెట్టు మీద ఉంచాలి.ఇలా ఉంచిన కొద్ది రోజులకు అవి పూర్తిగా ఎండిపోతాయి.ఆకులు ఎండిపోతున్న కొద్దీ మన పనులు సులభతరం అవుతాయి. మొదలు పెట్టి ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే దేవాలయంలో ఉండే రావిచెట్టుకు, వేప చెట్టుకు నమస్కరించి ఆ చెట్ల ముందు నువ్వుల నూనెతో దీపం ఉంచి ఒక పెద్ద నూలు దారాన్ని తీసుకుని దానిని తొమ్మిది పోగులుగా చేసి వాటికి పసుపును రాసి తొమ్మిది సార్లు ఆ చెట్ల మొదలుకు దారాన్ని చుడుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీమన్నారాయణ మేము తలపెట్టిన పనులు ఏ ఆటంకం కలగకుండా జరిగేలా చేయి స్వామి అని మనుసులోఅనుకోవాలి..ఇలా చెయ్యడం వల్ల అన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version