సోనూసూద్.. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ పేరు తెలియని వారుండరు. ఎవరినీ అడిగినా చెబుతారు. ఎందుకంటే కరోనా సమయంలో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందిని ఆదుకున్నారు. ఇప్పటికీ తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం…
సోనూసూద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయనకు ధూమపానం,మద్యపానం లాంటి చెడు అలవాట్లు లేవు. ఆరోగ్యం పాడవుతుందని ఆయన అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు. ఆయన ఎక్కువగా పార్టీలకు కూడా వెళ్లరు. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడుపుతారు.
సోనూసూద్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కెరీర్ మొత్తంలో ఆయనపై చిన్న మచ్చ కూడా పడలేదు. కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన సోనూ తన సొంత హోటల్స్‌ను సైతం క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. అయితే ఆ తర్వాతే కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారని ఆయన కార్యలయాలు, ఇళ్లపై రైడ్స్ జరిగాయి.
సోనూ ఐకానిక్ రోల్స్..
అనుష్క ప్రధానపాత్రలో వచ్చిన ‘అరుంధతి’లో అఘోర పాత్ర వేసి ఉత్తమ విలన్‌గా అవార్డు అందుకున్నారు. ఈ పాత్రతోనే ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది.
సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాలో చెడ్డీ సింగ్‌గా విలన్ పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆయన మంచి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
హృతిక్‌రోషన్-ఐశ్వర్యరాయ్ జంటగా వచ్చిన ‘జోదా అక్బర్’లో ఆయన ఐష్ అన్నయ్య సుజామల్ పాత్ర పోషించారు. ఈ రోల్లో తన ఎక్స్ట్రార్డినరీ పెరఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు.
ఇంక హిందీలో ‘సింబా’, ‘సింగ్ ఈజ్ కింగ్’లో పోషించిన విలన్ రోల్స్.. బాలీవుడ్లో మంచి పాపులారిటీని తీసుకొచ్చాయి. ఇక తెలుగులోనూ ‘ఏక్‌నిరంజన్’లో సైకో విలన్ పాత్ర, ‘జులాయి’లోని ప్రతినాయకుడి పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.