తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు.. అత్యథికంగా హైదరాబాద్‌లో

-

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అదేవిధంగా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి రోజు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ అధికంగా కేసులు రికార్డవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 705 నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. శనివారం 851గా ఉంటే..శుక్రవారం ఈ కేసుల సంఖ్య 923గా ఉన్నాయి.

531 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 10, 192 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.82 శాతంగా ఉందని, మొత్తం 32 వేల 834 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. అత్యథికంగా.. హైదరాబాద్ లో 355, రంగారెడ్డి 48, కరీంనగర్ 42, మేడ్చల్ మల్కాజ్ గిరి 35 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version