చింతపండు వేసిన వంటలు బాగా తింటున్నారా.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం.. ప్రత్యామ్మాయం ఇదిగో!

-

పులుపుకి వంటల్లో అందరూ చింతపండునే వాడుతుంటారు. పులుసు కూరల్లో అయితే.. చింతపండు గుజ్జు వేసేస్తాం. రుచి బాగుంటుంది కానీ.. చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. ఏ వంటల్లో అయితే చింతపండుని ఎక్కువగా వాడతారో.. ఆ వంటల్లో కారం, మసాలా, నూనె ఎక్కువగా పడుతుంది. వీటన్నింటికంటే ఉప్పు ఎక్కువగా పడుతుంది. అందుకనే చింతపండు వేసిన వంటలు అంత త్వరగా చద్దివాసన రావు..ఎందుకంటే..ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా చింతపండు వేసే వంటలు ఎక్కువగా తినటం వల్ల..కొంతకాలానికి బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధమైన జబ్బులు, అలర్జీలు, వాపులు ఇవన్నీ ఎక్కువవువాతాయి.
చింతపండు హైలిక్‌ యాసిడిక్‌ ఫుడ్…ఇది ఎక్కువగా తీసుకోవఀడం వల్ల దంతాలపైన ఎనామిల్‌ దెబ్బతింటుంది. చింతపండు ఉన్న ఆహారాలు మనం తినేసరికి పొట్టలో ఉండే హెల్ప్‌ఫుల్‌ బాక్టిరీయాలు చచ్చిపోతాయి. ఇంకా ఈ చింతపండు వేసిన వంటలు త్వరగా అరగవు..పులుస్తాయి…ఫలితంగా గ్యాస్‌. అందుకే..పులుసు కూరలు తిన్నప్పుడు కొందరికి ఈ గ్యాస్‌ ప్రాబ్రమ్స్‌ వస్తుంటాయి. గ్యాస్‌ సమస్యతో బాధపడేవారికి.. డాక్టర్లు కూడా చింతపండుని మానేయమని చెప్తుంటారు. ఇంకా చింతపండు వేసిన వంటల్లో..కూర తక్కువ రైస్‌ ఎక్కువగా తినేస్తారు. అంటే మనకు తెలియకుండానే..చింతపండు వేసిన కూరలు తిన్నప్పుడు రైస్‌ ఎక్కువగా లాగిస్తుంటాం. ఇవన్నీ చింతపండు వల్ల కలిగే అనర్థాలు..మరి చింతపండు లేకుండా..కొన్ని వంటలు చేయలేం కదా..అప్పుడేలా అనుకుంటున్నారా..ప్రత్యామ్మాయం ఉందిగా..
చింతపండుకు బదులుగా.. మామిడికాయపొడి వాడుకోవచ్చు. సంవత్సరం. పొడవునా దొరుకుతుంది..ఇంకా అనేక లాభాలు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో మామిడికాయ పొడు అందుబాటులో ఉంటుంది. ఉప్పువేసి అమ్ముతారు..ఉప్పులేకుండానూ అమ్ముతారు. ఉప్పులేని మామిడికాయ పొడిని తెచ్చి వాడుకోవచ్చు.
100గ్రాముల మామిడికాయ పొడి తీసుకుంటే
360కాలరీల శక్తి ఉంటుంది.
64 గ్రాముల పిండిపదార్ధాలు ఉంటాయి.
13గ్రాముల పీచుపదార్ధాలు ఉంటాయి.
45 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది. మన బాడీకీ కావల్సింది సుమారుగా 28 మిల్లీగ్రాములు ఒక రోజుకు.
మామిడికాయ పొడిలో చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత లోపాన్ని సవరించడానికి ఈ పొడి చాలా మంచిది. చింతపండు వాడితే..రక్తం విరిగిపోతుంది…కానీ మామిడికాయ పొడి వాడితే..రక్తం పెరుగుతుంది.
మామిడికాయ పొడిలో మాంగిఫెరిన్‌ అనేది ఉంటుంది. ఇది మనం తీసుకోవడం వల్ల కరోనరి ఆట్రీస్‌..అంటే..గుండెరక్తనాళాల్లో పూడికలు రాకుండా, బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా మంచిది. ఈరోజుల్లో హార్ట్‌ బ్లాక్స్‌ చాలామందికి ఏర్పుడతున్నాయి. ఈ మామిడికాయ పొడి ఈ సమస్య రాకుండా నివారిస్తుంది.
ఇందులో ఉండో క్లోరోజనిక్‌ యాసిడ్‌ రక్తం లోపలకి చెక్కర ప్రేగులు గ్రహించుకోకండా..మలం ద్వారా బయటకు వచ్చేలా చేస్తుంది. దానిద్వారా డయబెటీస్‌, ఒబిసీటీ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడేవారు..ఘగర్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.
వాలనిక్‌ యాసిడ్‌ అనేది మాంగోపొడిలో బాగా ఉంటుంది. ఇది డైజెషన్‌కు బాగా ఉపయోగపుడుతుంది. పెయిన్స్ తగ్గించడానికి కూడా పనికొస్తుంది. చింతపండు వాడితే..పెయిన్స్‌ ఎక్కువవుతాయి. దానికి బదులుగా వాడే మామిడికాయ పొడిని వాడితే..పెయిన్స్‌ తగ్గుతాయి.
చింతపండు ఔషధం..మోషన్‌ బాగా జరగడానికి మందు. కానీ ఇది ఆహారం కాదు..కాబట్టి సమస్య ఉన్నప్పుడు మాత్రమే వాడాలి..వంటల్లో వాడొద్దు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్యనిపుణులు.
మామిడికాయ పొడిచేసేప్పుడు మామిడికాయ తొక్కలతోపాటే..ఎండపెట్టి గ్రైండ్‌ చేస్తారు. ఈ పొడిలో ఉండే ఎమైలీజ్‌, ప్రోటీజ్‌ అనే కొన్ని ఎంజైమ్స్‌ డైజెషన్‌ బాగా జరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఇన్ని లాభాలు మామిడికాయ పొడిలో ఉన్నాయని సైంటిఫిక్‌గా నిరూపించినవారు..సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ టెక్నాలజికల్‌ రీసర్చ్‌ ఇన్సిస్ట్యూట్‌ మైసూర్‌.
కాబట్టి చింతపండుని రెగ్యులర్‌గా వాడటం తగ్గించి..మామిడికాయ పొడిని అందుకు బదులుగా వాడుకుంటే..ఆరోగ్యానికి మంచిది. మామిడిపొడిలేకపోతే..డైరెక్టుగా పచ్చిమామిడికాయను వేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు ఉడికించి గుజ్జుతీసి పోయొచ్చు. సీజన్‌లో మామిడికాయ దొరికినప్పుడు ముక్కలుగా చేసి..ఎండపెట్టుకుని పొడి చేసుకోవచ్చు. వంటల్లో టేస్ట్‌కు మాత్రమే ప్రధాన్యత ఇస్తే..ఆరోగ్యంగా ఉండలేం. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version