టూత్ పేస్ట్ వాడటం వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా..?

-

ఒకప్పుడు మన పూర్వీకులు వేపపుల్లలు, బొగ్గు, ఇటుక పొడితో పళ్లను తోముకునే వారు. ఇటుకపొడిలో కొంచెం ఉప్పు వేసుకుని దానిని బాగా నూరి దానితోనే బ్రేష్ చేసుకునే వారు. అప్పుడు బ్రేష్‌లు, టూత్ పేస్టులు అందుబాటులో లేవు. బ్రేష్ స్థానంలో వేప పుల్లలను ఉపయోగించేవారు. అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు ఉన్నాయి. కాలక్రమేనా అనేక మార్పులు జరిగాయి. వేప పుల్లల స్థానంలో టూత్ పేస్టులు వచ్చాయి. దీంతో ఉదయం నిద్ర లేవగానే చేతిలో బ్రేష్ పట్టుకుని టూత్ పేస్ట్‌తో పళ్లు తొముతున్నాం.

టూత్ పేస్ట్- బ్రేష్

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కంపెనీలు తమ టూత్ పేస్ట్ మంచిదని అడ్వర్‌టైజ్ చేస్తుంటాయి. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా.. లవంగం ఉందా.. పుదీనా ఉందా అంటూ ముందుకు వస్తున్నాయి. మరి కొన్ని తాజా శ్వాస కోసం ఈ టూత్ పేస్ట్‌లను వాడండని, ఇంకొన్ని దంతాల నరాలు జివ్వు మంటున్నాయా అంటూ యాడ్స్ వేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే ఈ టూత్ పేస్ట్‌ల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెమికల్‌తో కూడిన పేస్ట్‌లను వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.

సాధారణంగా ప్రతిరోజు పళ్లు తోముకోవడానికి వాడే టూత్ పేస్ట్‌లో ఎన్నో రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. ఇవి చిగుళ్లలో నుంచి రక్తంలోకి కలుస్తాయి. దీని వల్ల అనారోగ్యానికి గురవుతాము. ఎందుకంటే టూత్ పేస్ట్‌లో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వల్ల హార్ట్ డిసీజ్, మెదడు సమస్య, కిడ్నీ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. టూత్ పేస్టులు తియ్యగా ఉండేందుకు ఇందులో అస్పర్టేమ్ అనే పదార్థాన్ని కలుపుతారు. ఈ పదార్థం వల్ల బ్రెయిన్ ట్యూమర్, లింఫోమా, లుకేమియా వంటి వ్యాధులు వస్తాయి. ఇది శరీరంలో ప్రవేశించగానే తలనొప్పి, కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది. టూత్ పేస్ట్ నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్‌ను వాడుతారు. దీని వల్ల లివర్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇందులో ఉండే సార్బిటాల్ అనే రసాయనం వల్ల అజీర్ణం, విరోచనాలు, గ్యాస్ వంటి వ్యాధులు తలెత్తుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version