కర్పూరంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. అసలు కర్పూరం ఎలా తయారవుతుంది..?

-

కర్పూరాన్ని పూజల్లోనూ, ఆయిల్స్‌లో వేసి పెయిన్స్‌కు వాడతుంటారు. కర్పూరం అంటే ఒక పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది కదా..! గుమాలించి కొట్టే వాసన..కర్పూరంలో చాలా రకాల ఉన్నాయి.. కానీ మనకు తెలిసినవి రెండే.. ఒకటి ఇలా పూజగదిలో వాడితే ఇంకోటి పచ్చకర్పూరం ఇది వంటల్లో కూడా వాడతారు. బ్యూటిటిప్స్‌లో కూడా వాడుతుంటారు. ఎప్పుడూ కర్పూరం వల్ల ఉపయోగాలే కాదు.. అసలు ఇది ఎలా చేస్తారో కూడా తెలుసుకోవాలి కదా..! ఈరోజు కర్పూరం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దామా..!

కర్పూరం చెట్ల కాండం నుంచి తయారు చేయబడుతుంది. కర్పూరం చెట్టు నలభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాగే.. వెయ్యేళ్ళ వరకు బతికే ఉంటుందట… ఇది టర్పెనాయిడ్ అనే రసాయనాన్ని కూడా విడుదల చేస్తుంది. ఈ రసాయనం సిన్నమోనం కామ్ఫర, రోజ్ మేరీ, కేంఫర్ బేసిల్, డ్రయనోబాలనోప్సిస్ వంటి మొక్కల నుంచి కూడా లభిస్తుంది. ఈ మొక్కల కాండాన్ని వేరు చేసి, చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తారు.

వీటిని ఒక పెద్ద బట్టీలో వేసి నీరు పోసి వేడి చేస్తారు. స్వేదన ద్వారా ఆవిరిని చల్లబరుస్తారు.. అలా కర్పూరాన్ని తయారు చేస్తారు. జపాన్ దేశంలో 150 ఏళ్ళ క్రితం నుంచి ఫుకుయోక అనే ప్రాంతంలో కర్పూరాన్ని తయారు చేస్తున్నారట.. అంతేకాదు చెట్ల ఆకులు, పండ్ల నుంచి కూడా కర్పూరం తయారు అవుతుంది.

మన దేశంలో నీలగిరి కొండల్లో కర్పూరం చెట్లు పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. అయితే ఈ కర్పూరం చాలా రకాలున్నాయి. ఒకొక్కటి ఒక్కోరకంగా మనకి ఉపయోగపడతాయట..

పచ్చకర్పూరం:

కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాల్లో కూడా వినియోగిస్తారు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారట. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

హారతి కర్పూరం

టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడరు.

రస కర్పూరం

చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం

సహజముగా మొక్క నించి లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అని అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడతారు.

సితాభ్ర కర్పూరం ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇంకా ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని బోలెడు రకాల కర్పూరాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version