లవంగాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? ఈ సమస్యలకు మంచి పరిష్కారమట..!

-

మసాల దినుసుల్లో నెంబర్ వన్ స్థానం…లవంగాలది. ఈ పొడి వేయగానే ఆ వంటలో వచ్చే సువాసన అమోఘం. లవంగాల్లో ఉన్న ఆయుర్వేద గుణాలను మన బుుషులు ఎప్పుడో గుర్తించి..వంటల్లో వేయదగిన ఐటమ్ గా పెట్టారు. లవంగాలు వాడే చాలా మందికి అది వంటకు సువాసన ఇచ్చే పదార్థంగానే తెలుసు.. ఈరోజు లవంగాల్లో ఉన్న మెడిసినల్ ప్రోపర్టీస్ ఏంటి, సైంటిఫిక్ స్టడీ ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం.

లవంగాల్లో ఉన్న ఔషధ విలువలు ఏంటంటే..

ఏ ఆహారంలో లేనన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లవంగాల్లో ఉన్నాయి. 9-15 గ్రాముల వరకూ యాంటిఆక్సిడెంట్ యూజినాల్ 100 గ్రాముల లవంగాల్లో ఉంది.. మరే ఇతర ఆహారంలోనూ..మిల్లీగ్రాముల్లోనే ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ యాంటివైరల్, యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్ కు పవర్ ఫుల్ గా పనికొస్తుంది. అధికబరువు ఉన్న వారికి తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి కొవ్వుకణాల్లో పేరుకును నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ ఉన్న కొవ్వు గాలితో రియాక్షన్ అయి ఆక్సిడెషన్ జరుగుతుంది. అక్కడ నుంచి శరీరంలో అనేక రకాల రోగాలు పుట్టడానికి కారణం అవుతాయి. యూజినాల్ ఇలా ఆక్సిడేషన్ జరగకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడతుంది.
క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా..కూడా యూజినాల్ చేయగలగుతుందని సైంటిఫిక్ స్టడీలో నిరూపించారు.
లవంగాల్లో ఉండే టానిన్స్ అనే యాంటిఆక్సిడెంట్స్ కూడా 2.3- 2.5 గ్రాముల వరకూ ఉన్నాయి. ఇవి శరీరంలో నొప్పిని తగ్గించడానికి పనికొస్తాయట. లవంగాలు కానీ, లవంగాల నూనె వాడినప్పుడు నొప్పులు తగ్గుతాయి. ఈ రెండు యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా నిరోధిస్తుంది. ఎవరిలో అయితే ఇన్సులిన్ పనిచేయదో..వారికి చెక్కర వ్యాధి, ఓవరీస్ లో నీటిబుడగలు వస్తాయి. ఒబిసిటీ ఉన్నవారికి ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఇన్సులిన్ రెస్సిస్టెన్స్ రాకుండా..కాపడటానికి లవంగాల్లో ఉండే ఈ రెండు యాంటీఆక్సిడెంట్స్ కాపడతాయిని పరిశోధన చేసి ఇచ్చారు. 51 పరిశోధనా పత్రాలను సంగ్రహించి బ్రెజిల్ వారు అధ్యయనం చేసి ఇచ్చారు.
లవంగాలను మనం ఎక్కువగా పిప్పిపన్నుకు, నోట్లో ఏదైనా నొప్పికి వాడుతుంటారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలియకుండానే మనం ఈ చిట్కాను వాడుతున్నాం. లవంగాలను కాల్చి నోట్లో నొప్పి ఉన్న ప్రదేశంలో పెడితే..ఇందులో ఉన్న యూజినాల్ నొప్పి తగ్గించి, బాక్టీరియాలను చంపేసి నాచురల్ గా పెయిన్ తగ్గిస్తుంది. లవంగాల కంటే..లవంగాల నూనె వేసుకున్న ఆ ప్రదేశంలో మంచి ఫలితం ఉంటుంది.
లవంగాలు వల్ల యసిడిటీ, గ్యాస్ ట్రబుల్ రాకుండా కూడా రక్షిస్తుంది. చాలామందికి భోజనం తర్వాత గుట్కా, సిగిరెట్, సోంపు లాంటివి తినే అలావుటు ఉంటుంది. అలాంటివారు.. భోజనం తర్వాత లవంగం నోట్లో వేసుుకుని గంటపాటు అలానే ఉంచుకుంటే.. ఆ ఘాటుకు మరేదానిపై తినాలనే కోరిక రాదు.
నోటి దుర్వాసనకు కూడా లవంగాలు పనికొస్తాయి.. లవంగం సైజ్ చిన్నదేమో కానీ.. దాని వల్ల వచ్చే లాభాలు మాత్రం చాలా ఉన్నాయి. కాబట్టి పైన పేర్కొన్న సమస్యలు ఉన్నావారే కాదు..వంటల్లో కూడా వాడుతూ ఉంటే.. మంచి ఫలితాలు పొందవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version