రష్యాకు బిగ్ షాక్… వీసా, మాస్టర్ కార్డ్ సేవలు బంద్

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పలు ఆంక్షలు విధించాయి. రష్యా బ్యాంకులను బ్లాక్ చేయడంతో పాటు తమ గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకను నిషేధించాయి. ఇదిలా ఉంటే గూగుల్ పే, ఆపిల్ పే వంటి సేవలను కూడా ఆయా కంపెనీలు నిలిపివేశాయి. మైక్రోసాఫ్ట్ తమ ఉత్పత్తులను రష్యాలో అమ్మకుండా నిషేధం విధించింది. మరోవైపు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, యాప్ స్టోర్ వంటివి కూడా నిషేధం విధించాయి. 

ఇదిలా ఉంటే రష్యాకు మరో షాక్ తగిలింది. ఆర్థిక లావాదేవీలకు ముఖ్యమైన మాస్టర్ కార్డ్, వీసా సేవలను నిలిపి వేస్తున్నట్లు ఆయా కంపెనీలు వెల్లడించాయి. వీటితో పాటు ప్యూమా కూడా తమ ఉత్పత్తులను రష్యాలో అమ్మకుండా నిషేధం పెట్టింది. ఉక్రెయిన్ పై మాస్కో దాడి చేసిన తర్వాత తమ ఉత్పత్తులను డెలవరీలను ఆపేసిట్లు వెల్లడించింది.

మరోవైపు ఈ ఆంక్షలకు ఏమాత్రం లొంగడం లేదు రష్యా. రష్యాపై ఆంక్షలు అంటే యుద్ధంతో సమానం అంటూ… అధ్యక్షుడు పుతిన్ నాటో దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్నీ ఆలోచించుకున్నతర్వాతే ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version