బాలకృష్ణ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా..?

-

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇక ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ అంటే ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా అందరికీ ముందుగా గుర్తొస్తుంది . చిన్నగా విడుదలైన ఈ సినిమా 200 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు సృష్టించడమే కాకుండా బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది. ఇకపోతే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటివరకు బాలయ్య తన సినీ కెరీర్లో ఎన్నో సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. అఖండ:
బోయపాటి శ్రీను దర్శకత్వం లో ద్విపాత్రాభినయం చేస్తూ తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే బాలయ్య కెరీర్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పవచ్చు.

2. మంగమ్మగారి మనవడు:
1984 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మంగమ్మగారి మనవడు చిత్రం బాలయ్య సినీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య.

ఇక ఆ సినిమాల లిస్టు విషయానికి మాత్రం.. కథానాయకుడు, అనసూయమ్మ గారి అల్లుడు, బాబాయ్ అబ్బాయ్, ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సహోదరులు, సీతారాముల కళ్యాణం, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, లారీ డ్రైవర్ , ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవదీపం , బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, శ్రీరామరాజ్యం, లెజెండ్, జై సింహ వంటి చిత్రాలు బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version