మనం రోజువారి జీవితంలో వాడే కొన్నిపదాల అర్థం తెలియకున్నా ఆ సమాయానికి అదే కరెక్టు అనుకుని వాడేస్తుంటాం..అనుకుంటాం ఇది ఆ పదానికి ప్రత్యామ్మాయ పదమేమో అని. కొన్నింటికి మధ్య తేడాలుంటాయ్.. కానీ అవిమనకు పెద్దగా తెలియదు. అందులో ఒకటి లాయర్, అడ్వకేట్ . ఈ రెండూ ఒకటే అనుకున్నారుగా ఇప్పటివరకూ..ఆ లా చదివిన వాళ్లకు మాత్రమే దీనిపై అవగాహన ఉండొచ్చు..సామన్యప్రజలు అంతా ఒకటే అనుకుని వాడేస్తుంటారు. కానీ ఈ రెండు వేర్వేరట.
లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే లా గురించి చెప్పగలుగుతారు. కానీ వారు కోర్ట్ లో ఒక క్లయింట్ తరపున వాదించలేరు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లైంట్ తరుపున వాదించగలుగుతారు.
లాయర్ అంటే అప్పుడే గ్రాడ్యూయేట్ కంప్లీట్ చేసి వస్తాడుకదా..అంత అనుభవం ఉండదు. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి. అడ్వకేట్ దగ్గర లాయర్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎన్నో కేసులను వాదించడం వలన అడ్వకేట్ కి అనుభవం ఎక్కువగా ఉంటుంది.
అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఛార్జ్ చేసే ఫీజ్ తక్కువగా ఉంటుంది. అనుభవం ఎక్కువగా ఉండటం వలన అడ్వకేట్లు లాయర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటారు.
ఒకవేళ ఒక వ్యక్తి ఇంగ్లాండులో, సౌత్ ఆఫ్రికాలో, లేదా స్కాట్ ల్యాండ్ లో లా చదివి వస్తే వారిని బారిష్టర్ అని అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానం. కేవలం పేరు తేడా అంతే. అడ్వకేట్ లాగానే బారిష్టర్ కేస్ టేకప్ చేసి వాదించగలరు.
ఇదండి..వీళ్లిద్దరికి మధ్య ఇంత తేడా ఉందనమాట.