బింబిసార దర్శకుడు హీరోగా నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా?

-

జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త క‌థ‌ల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్య‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు క‌థానాయ‌కుడు క‌ల్యాణ్ రామ్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడాయ‌న‌ బింబిసారగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు వశిష్ఠ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సోషియో ఫాంట‌సీ సినిమా ఇది. అయితే ఈ క్రమంలో చాలా మందికి తెలియని ఓ విషయం బయటకు వచ్చింది. దర్శకుడు వశిష్ఠ… హీరోగా తన సినీ కెరీర్ ప్రారంభించాడని తెలిసింది. ఆయన అసలు పేరు వెంకట్.

ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడుగా వెంకట్ వెండితెర అరంగేట్రం చేశాడు. అతను 2007లో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంజలి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీతో గీత రచయిత కులశేఖర్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. కారణాలు ఏవైనా ఈ సినిమా అనుకున్న సమయంలో అనుకున్న విధంగా విడుదల కాలేకపోయింది. ఇప్పుడది యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అందులో హీరోగా నటించిన వెంకట్‌ను అందరూ ముద్దుగా వేణు అనిపిలుస్తారు.

హీరోగా నటించిన తొలి చిత్రంతో ఎదురైన చేదు అనుభవాలతో వేణు… నటనకు స్వస్తి చెప్పి, దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫాంటసీ యాక్షన్ కథను తయారుచేసుకుని తెలిసినవారిని కలిస్తూ వచ్చాడు. కొత్త దర్శకుడి మీద నమ్మకం లేక కొందరు, ఇంత భారీ చిత్రాన్ని తీసి రిస్క్ చేయడం ఇష్టం లేక మరికొందరు వేణుకు అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో కథ నచ్చి కల్యాణ్ రామ్ అభయహస్తం చూపాడు. వెంకట్ ఈ సినిమా కోసం తన పేరును వశిష్ఠగా మార్చుకున్నాడు. అతను రూపొందించిన తొలి చిత్రం ‘బింబిసార’. శుక్రవాం విడుదలై విజయపథంలో సాగుతోంది. వెంకట్‌గా సాధించలేని విజయాన్ని వశిష్ఠగా వేణు సాధించాడు!

బింబిసార విషయానికొస్తే.. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా.. నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన సోషియో ఫాంటసీ అండ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఆయన కెరీర్​లోనే భారీ స్థాయిలో రూపొందింది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్‌ అవతారంలోనూ కనిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version