మీకు పాన్‌కార్డ్ ఉందా? అయితే ఓసారి పాన్ కార్డ్ చెక్ చేయండి. అందులో పది డిజిట్స్ ఉంటాయి. దానికి అర్థం ఏంటో తెలుసుకోండి. దీని అర్థం చాలామందికి తెలియదు. ఆ డిజిట్స్ ఓ ఫార్మాట్ ప్రకారం ఉంటాయి. ్కఅN అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు ఇది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఒకేసారి జారీ అవుతుంది. ఇక ఎప్పటికీ అదే నంబర్ ఉంటుంది. ఒకవేళ కార్డు పోయినా తిరిగి దరఖాస్తు చేస్తే మళ్లీ అదే నంబర్ వస్తుంది. అందుకే దీన్ని పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు. భారీ స్థాయిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరపాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ నెంబర్ తప్పనిసరి.
ఇక పాన్ కార్డులో ఉన్న 10 డిజిట్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటి ఐదు, చివర్లో ఒక ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. 6 – 9 వరకు నంబర్స్ ఉంటాయి. మొదటి మూడు ఇంగ్లీష్ లెటర్స్ పాన్ కార్డ్ సిరీస్‌ను సూచిస్తుంది. ఈ సిరీస్ AAA నుంచి ZZZ వరకు ఏదైనా ఉండొచ్చు. ఇక నాలుగో లెటర్ పాన్ కార్డ్ తీసుకున్నవారి స్టేటస్‌ని తెలుపుతుంది. అంటే వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారికి నాలుగో లెటర్ P ఉంటుంది.P అంటే పర్సనల్ . వ్యక్తిగతంగా పాన్ కార్డు తీసుకున్నవారెవరికైనా నాలుగో లెటర్ P అనే ఉంటుంది. ఒకవేళ ట్రస్ట్ తరఫున తీసుకుంటే T, సంస్థ తరఫున తీసుకుంటే ఊ, హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ తీసుకుంటే H, కంపెనీ తరఫున తీసుకుంటే C అని ఉంటాయి.
ఇక ఐదో లెటర్ కార్డ్ హోల్టర్ ఇంటిపేరు లేదా చివరి పేరులో మొదటి అక్షరం ఉంటుంది. సర్‌నేమ్‌లో మొదటి లెటర్ ఏది ఉంటే పాన్ కార్డులో ఐదో లెటర్ అదే ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. చివర్లో లెటర్ A నుంచి Z వరకు ఏదో ఒకటి ఉంటుంది. ఈ చివరి డిజిట్‌ను పాన్ నెంబర్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఈ విధంగా 10 డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌తో పాన్ కార్డ్ జారీ అవుతుంది. పాన్ కార్డు పైన ఉంటే ఈ 10 డిజిట్స్ వెనక ఉన్న ఆసక్తికర విషయం చాలామందికి తెలియదు. మరి మీరు కూడా మీ పాన్ నెంబర్ ఓసారి చెక్ చేసుకోండి. అయితే భారీ లావాదేవీలు చేసి, ట్యాక్స్ కట్టే ప్రతిఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండాలి.