మనం తెలియక చేసే చిన్న చిన్న పనులే మన ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టేస్తాయి. అందుకనే మనం పాటించే పద్ధతి సరైనదా కాదా అనేది తెలుసుకుని అప్పుడు మాత్రమే అనుసరించాలి. ఖాళీ కడుపుతో మాత్రం ఈ పనులు చేస్తే సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అయితే ఖాళీ కడుపుతో ఎటువంటి తప్పులు చేయకూడదు..? వేటి వల్ల సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.
ఆల్కహాల్ తీసుకోవడం:
ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలా ఒకవేళ తీసుకుంటే బ్లడ్ స్ట్రీమ్ లోకి డైరెక్ట్ గా వెళ్లి పోతుంది దీనితో బీపీ మొదలైన సమస్యలు వస్తాయి. కాబట్టి అస్సలు ఖాళీ కడుపుతో తీసుకోవద్దు.
చూయింగ్ గమ్:
ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. డైజెస్టివ్ యాసిడ్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో కోప్పడకండి:
ఖాళీ కడుపుతో కోపం కి గురవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఖాళీ కడుపుతో కోపానికి గురైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో సమస్యలు వస్తాయి. అలాగే మూడ్ స్వింగ్స్ లాంటివి కలుగుతాయి.
నిద్ర పోవద్దు:
ఖాళీ కడుపుతో నిద్రపోవడం కూడా మంచిది కాదు. తిన్న రెండు నుంచి మూడు గంటలసేపు గ్యాప్ ఇచ్చి అప్పుడు పడుకోవాలి. అయితే ఆకలి వేయకపోతే కొంచెం పాలు లాంటివి ఏమైనా తీసుకుని అప్పుడు నిద్ర పోవడం మంచిది. అంతేకానీ ఖాళీకడుపుతో నిద్ర పోకండి.