ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత డ్రైవర్‌ శాలరీ ఎంతో తెలుసా..?

-

సెలబ్రిటీల లైఫ్‌స్టైలే వేరు..లంకంత ఇళ్లు..చుట్టు పనిమనుషులు, చిటికేస్తే చాలు…క్షణాల్లో ఏదైనా రెడీ అవుతుంది.. ఆహా అలాంటి జీవితం ఒక్కరోజైనా ఉండాలని చాలామంది అనుకుంటారు.. సెలబ్రెటీలతో పాటు..వారి దగ్గర పనిచేసే వాళ్లకు కూడా..మినిమమ్‌ రేంజ్‌ ఉంటుంది. అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అతడి జీతం గురించిన వివరాలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

2017లో ముకేశ్‌ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలని దానిని బట్టి తెలుస్తోంది. అంటే ఏడాదికి రూ.24 లక్షలు. బహుళజాతి సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈ స్థాయి జీతం ఉండదు.. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. 2023లో ఇంకా ఎంత పెరిగి ఉంటుందో ఆలోచించండి…అది ఎంతనేదానిపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.

ప్రపంచకుబేరుడు ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి పనిలో ఎంతో నైపుణ్యం ఉండాలి.. అంబానీ డ్రైవర్లను ఓ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలావాడాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయి. ఏ తరహా రోడ్లపైన అయినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి పూర్తి ట్రైనింగ్‌ ఇస్తారు.

డ్రైవర్లతో పాటు వంటమనుషులు, గార్డ్స్‌, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని ఆ కథనాలు వెల్లడించాయి. ఇదే తరహాలో ఇదివరకు సినిమా సెలబ్రిటీల మేనేజర్లు, బాడీ గార్డులు, నానీ(ఆయా)ల జీతాలు అప్పట్లో బయటకు వచ్చాయి. అక్షయ్‌ కుమార్, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలు తమ బాడీగార్డులకు ఏడాదికి కోట్లల్లో జీతం ఇస్తున్నారు. కరీనా కపూర్‌ తన పిల్లల్ని చూసుకునే నానీకి నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తుండగా.. ఎప్పుడైనా ఓవర్‌ టైమ్ చేస్తే ఆ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతారట. అమ్మో.. ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఇక ఇటీవల షారుక్‌ ఖాన్‌ మేనేజర్ ఒక విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఆమె సంవత్సరానికి రూ. 7 కోట్ల నుంచి 9 కోట్ల జీతం అందుకుంటారని టాక్.. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version