ప్రభుత్వ వేధింపుల వల్ల కూడా గుండెపోట్లు వస్తున్నాయి – చంద్రబాబు

-

టిడిపి నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ పరుపుల రాజా హఠాన్మరణం పై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరుపుల రాజా భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజా మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. ఆత్మీయ స్నేహితుడు రాజా మృతి షాక్ కి గురిచేసిందన్నారు.

యువనేతను తెలుగుదేశం కుటుంబం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ తో పాటు ప్రభుత్వ వేధింపుల వల్ల కూడా గుండెపోట్లు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ టీచర్లు చాలామంది కుప్పకూలిపోతున్నారని, భయంతో పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు నారా చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version