బతుకమ్మ పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది.9 రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. నవరాత్రులకు ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు. బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి.
ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు..
1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ..7) వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజును అంటే రేపు ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. ఈ రోజున వెన్నముద్ద, బెల్లం, నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో ఎనిమిదంతరాల బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపు గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేస్తారు. సాయంత్రం బతుకమ్మ ఆడిపాడిన తర్వాత నిమజ్జనం చేస్తారు..తొమ్మిదవ రోజు హైలెట్..బతుకమ్మ తర్వాత పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉంటారని నమ్మకం..