ఈ స్టార్ డైరెక్టర్లు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యులు..

-

తెలుగు చిత్ర సీమలో దర్శకుడు అన్న పదానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి దర్శక రత్న దాసరి నారాయణ రావు అని సినీ పెద్దలు చెప్తుంటారు. ఆయన సమకాలీకుడు, ఆయనతో పోటీ పడి మరీ సినిమాలు చేసిన వ్యక్తి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమా ఫార్మాట్ క్రియేట్ చేసి, అలాంటి సినిమాలకు కేరాఫ్ గా కె.రాఘవేంద్రరావు నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని స్టార్ హీరోలందరితో చిరంజీవి వరకు చిత్రాలు తీసి ఘన విజయం అందుకున్నారు.

ఇటీవల ‘పెళ్లి సందD’ పిక్చర్ తో నటుడిగాను తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రాఘవేంద్రరావు. త్వరలో ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే..రాఘవేంద్రరావు శిష్యులు..అనగా ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసిన వారు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా దూసుకుపోతున్నారు. వారెవరో తెలుసుకుందాం.

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి..రాఘవేంద్రరావు వద్ద కొంత కాలం పని చేశాడు. జక్కన్న తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’కు దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారు.

యాక్షన్ డైరెక్టర్ గా పేరు గాంచిన డైరెక్టర్ బీ.గోపాల్..రాఘవేంద్రరావు శిష్యుడు. సీనియర్ ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ పిక్చర్ నుంచి బీ.గోపాల్ రాఘవేంద్రరావు వద్ద పని చేశారు. ‘ప్రతి ధ్వని’ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన గోపాల్..ఆ తర్వాత స్టార్ హీరోలందరితో దాదాపుగా సినిమాలు చేశారు.

క్రేజీ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కూడా రాఘవేంద్రరావు స్టూడెంటే. ‘పట్టాభిషేకం’ నుంచి ‘అన్నమయ్య’ వరకు ఆయన వద్ద పని చేసిన వైవీఎస్..తర్వాత దర్శకుడిగా మారాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ ఫిల్మ్స్ చేసిన కోదండరామిరెడ్డి..గురువుకు తగ్గ శిష్యుడిగా నిరూపించుకున్నాడు. రాఘవేంద్రరావు వద్ద కొంత కాలం ఏడీగా పని చేసిన కోదండరామిరెడ్డి ఆ తర్వాత..దర్శకుడిగా సినిమాలు చేసి గురువు రాఘవేంద్రరావుతో పోటీ పడటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version