అంత శాతం షూటింగ్ పూర్తయినా మధ్యలో ఆగిన బాలకృష్ణ సినిమా.. ఏదంటే?

-

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్య సినిమా విడుదల అయిందంటే చాలు పండుగ వాతావరణం వచ్చేస్తుంటుంది. ఇటీవల ఆయన నటించిన చిత్రానికి ప్రేక్షకులు ‘అఖండ’ ఆదరణ చూపారు. విదేశాల్లో ఉన్న అభిమానులు, తెలుగు వారు సైతం ఈ చిత్రాన్ని చాలా బాగా ఆదరించారు. బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నప్పటికీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల ద్వారా ఆయన కెరీర్ ఇంకా స్ట్రాంగ్ అయిందని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు.


చిత్ర పరిశ్రమలో మిగతా హీరోలతో పోలిస్తే బాలయ్య కొంచెం డిఫరెంట్ అంటుంటారు. చిత్రం ఒప్పుకుంటే చాలు.. అతి తక్కువ టైంలోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసేస్తుంటారట. అలా ఆయన సినిమా షూట్ మొదలైందంటే చాలు.. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. పౌరాణిక, సామాజిక పాత్రలతో పాటు సైన్స్ ఫిక్షన్ పాత్రలు పోషించేందుకు బాలయ్య ముందుకొస్తుంటారు. అయితే, ఆయన నటించిన చిత్రాలలో ఒకటి దాదాపు 60 శాతం పూర్తయింది. మిగతా 40 శాతం కంప్లీట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యేది. కానీ, అది అక్కడే మధ్యలోనే ఆగిపోయింది.

అదే ‘విక్రమ సింహ భూపతి’ చిత్రం. దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మిగతా భాగం చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ప్రొడ్యూసర్ ఎస్.గోపాల్ రెడ్డి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అలా ఆయన ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన కుమారుడు భార్గవ్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇంతలోనే చేదువార్త వచ్చింది. గోపాల్ రెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత భార్గవ్ తన తండ్రి మొదలు పెట్టిన చిత్రాన్ని పూర్తి చేయడం తనకు ఇష్టం లేదని బాలయ్య, కోడి రామకృష్ణలకు చెప్పాడు. దాంతో వారు కూడా భార్గవ్ కు అడ్డు చెప్పలేదు. అలా ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. ఒకవేళ ఆ చిత్రం విడుదల అయితే కనుక బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ మూవీ అయ్యేదని సినీ పరిశీలకులు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version