ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం కాస్త ఎక్కువ అయ్యింది..సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఈ ఫోన్లను వాడుతున్నారు..ఎంత ఎక్కువగా మనం ఫోన్ ను వాడతామో ఫోన్లు కూడా త్వరగా పాడై పోతాయి.ఫోన్ పనితీరు ఫోన్ లో ఉండే యాప్‌ల పై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బ్యాటరీ పనితీరు, డేటా వినియోగం యాప్‌ల పై ఆధార పడి ఉంటుంది. కొన్ని రకాల యాప్స్ డేటాను ఎక్కువగా వినియోగించుకుంటాయి. అయితే కొన్ని రకాల యాప్స్ మాత్రం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం యూజర్ల ఫోన్‌లను ఉపయోగిస్తున్నాయని గూగుల్ ప్రకటించింది.
ఇందులో భాగంగానే ఫోన్ బ్యాటరీ, డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న 16 యాప్‌లను ప్లేస్టోర్‌ల నుంచి తొలగించారు. యూజర్లు కూడా వెంటనే యాప్‌లను డివైజ్‌లను డిలీట్ చేసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్‌లు ఏంటి.. ఆ యాప్ ల వల్ల చార్జ్ ఎలా అయిపోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గూగుల్ తెలిపిన ఈ 16 యాప్‌లు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే హెచ్‌టీటీపీ రిక్వెస్ట్ సాయం తో ఒక రిమోట్ కాన్ఫిగరేషన్‌ను డౌన్‌లోడ్ చేస్తాయి. ఆ తర్వాత క్లౌడ్ మెసేజింగ్ ద్వారా డెవలపర్‌కు పుష్ మెసేజెస్ పంపుతాయి. వీటి సహాయంతో డెవలపర్ యూజర్‌కు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్ లో పలు వెబ్‌సైట్లు ఓపెన్ చేసి ఎంచుకున్న యాడ్స్ పై క్లిక్ చేస్తుంటాయి. ఇదంతా యూజర్లకు తెలియకుండానే జరుగుతుంది..
ఇలా చెయ్యడం వల్ల ఫోన్ చార్జింగ్ పోతుంది.డేటా వినియోగం పెరుగుతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే తెలిపింది. ఆ 16 యాప్ ల విషయానికొస్తే.. బుసాన్‌బస్, జాయ్ కోడ్, కరెన్సీ కన్వర్టర్, హైస్పీడ్ కెమెరా, స్మార్ట్ టాస్క్ మెనేజర్, ఫ్లాష్‌లైట్+, కే-డిక్షనరీ, క్విక్ నోట్, ఈజెడ్‌డికా, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్, ఈజెడ్ నోట్స్, మెమోక్యాలెండర్, ఫ్లాష్‌లైట్, క్యాల్‌కల్ వంటి యాప్స్ ఈ జాబితాలో ఉన్నాయి.. వీటిని వాడితే మాత్రమే మీ ఫోన్ పోవడం ఖాయం..