కామిక ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసా..?

-

కామిక ఏకాదశి ఆషాడ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ మాసంలో లోకాల అధిపతి అయిన శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన 4నెలల్లో వచ్చే మొదటి ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు.ఈ ఏకాదశి రోజున పూజలు చేయడంవల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరును మరియు ఈరోజు వెన్న దానము ఇవ్వడం వల్ల సంతాన ప్రాప్తి కలుగునని పురాణాలూ చెబుతున్నాయి.అసలు కామిక ఏకాదశి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని ” ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని” కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషితుడై “ఓ రాజా ! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే.. ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. ” ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి” అని కోరాడు.

దానికి బ్రహ్మ బదులిస్తూ ” నా ప్రియమైన కుమారుడా ! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదను.ఆషాఢ కృష్ణ పక్షములో మొదటగా వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ వింటేనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు.

ఈ ఉపవాస దీక్ష అంతటి శ్రీమహవిష్ణువు ఆచరించి ప్రజలకు బోధించాడు. ఈరోజు తులసిదలాలతో పూజించిన వారికి ఆయుష్ పెరుగును. గోవు మరియు దూడలను దానం ఇచ్చిన బంగారు, వెండి వంటి ఆభరణ లు, ధనము ధ్యాన్యము ఇంట్లో వెల్లివిరుయును.ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు… ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. ” అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా” శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.

Read more RELATED
Recommended to you

Exit mobile version