ఏ రంగంలో అయినా సరే పాత వాళ్లు పోయి కొత్త వాళ్ళు రావడం సహజం. ఈ క్రమంలోని కొంతమంది ఒక్క సినిమాకే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతూ ఉంటారు. అలా 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో మొదట మూవీ చేసిన హీరోయిన్ ఆ తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిధి గోవిత్రికర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమ్ముడు సినిమాలో హీరోయిన్ ప్రీతి జింగానియా క్యారెక్టర్ కాకుండా లవ్లీ క్యారెక్టర్ లో కనిపించిన బ్యూటీనే ఈ అతిధి గోవిత్రికర్.
పవన్ కళ్యాణ్ సుబ్బు క్యారెక్టర్ లో పాట పాడుతూ ..”హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చాపల్లే తుల్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి “.. అంటూ వెంటబడిన వయ్యారిభామ ఈమె.. ఇన్నేళ్లయింది కదా ఈమె ఫేసు అందరూ మర్చిపోయి ఉంటారు.. కానీ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ , ప్రీతీలతో పాటు లవ్లీ క్యారెక్టర్ ను ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరని చెప్పాలి. ఈమె తెలుగులో ఒక్క సినిమానే చేసి.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. ఇకపోతే మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో పుట్టి పెరిగిన అతిధి చిన్న వయసులోనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో టైటిల్స్ గెలిచి తెలుగులో తమ్ముడు సినిమాతో యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత నుండి పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది.
తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ అయ్యి మంచి అవకాశాలు వచ్చి ఉంటాయి.. కానీ ఆమె ఎందుకో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో అక్కడి సినిమాలే చేసుకుంటూ ఉండిపోయింది. ప్రస్తుతం అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తోంది. ముఫజల్ లక్డావాలా తో మెడిసిన్ చదివే సమయంలోనే పరిచయం ఏర్పడి .. ఏడేళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి రాకముందు అంటే 1998లో వివాహం చేసుకోగా.. 1999లో కియారా అనే అమ్మాయికి.. 2007లో మరో కూతురికి జన్మనిచ్చింది. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2009లో విడాకులు తీసుకున్నారు. అయితే అతిధి ప్రస్తుతం టీవీ షోలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అతిథి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.