క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన రోజు ఈస్టర్ డే (గుడ్ ఫ్రైడే). యేసు ప్రభువుని సిలువలు గుచ్చి హింసించిన రెండు రోజుల తర్వాత పునరుత్థానం అవుతాడు. అందుకే క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజును ఒక పండగలా నిర్వహించుకుంటారు. ఉదయాన్నే క్రైస్తవులు చర్చికి వెళ్లి బైబిల్ పఠిస్తారు. యేసు ప్రభువు జ్ఞాపకాలను స్మరిస్తూ పాటలు పాడుకుంటారు. ఈ రోజును ఈస్టర్ ఆదివారం అని కూడా పిలుస్తారు.
ఈస్టర్ డే ఎలా వచ్చిందంటే..
క్రైస్తవ మతం ప్రకారం.. గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అతను మరణించిన రెండు రోజుల తర్వాత పునరుద్ధరించబడ్డాడని, యేసు పునర్జన్మ తర్వాత 40 రోజులపాటు తన శిష్యులతో కలిసి ఉన్నాడు. అలా ఈస్టర్ పండుగను 40 రోజులపాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగను ప్రత్యేకంగా అబద్ధం, హింసపై సత్యం విజయం సాధించిందని క్రైస్తవులు ఎక్కువగా భావిస్తారు. అందుకే ఈస్టర్ డేను ఘనంగా జరుపుకుంటారు. ఈస్టర్ రోజు మొదటి వారాన్ని ఈస్టర్ వీక్‌గా పిలుస్తారు. ఈ రోజు క్రైస్తవులు ఒక చోట చర్చిలో చేరి బైబిల్‌ను పఠిస్తారు. ప్రత్యేక పండుగ సందర్భంగా చర్చిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకుని, కొవ్వొత్తుల వెలుగుల మధ్య యేసు ప్రభువును ప్రార్థిస్తారు.
గుడ్డు బహుమతి సంప్రదాయం
ఈస్టర్ రోజున క్రైస్తవులు భిన్న సంస్కృతిని పాటిస్తారు. ఒకరికొకరు గుడ్లను బహుమతిగా ఇస్తారు. అయితే గుడ్లతో ఆటలు కూడా ఆడుతారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి రంగురంగుల గుడ్లను తీసుకుని ఎక్కడైనా దాచిపెడతారు. వాటిని ఆ పిల్లలు కనుగొనవలసి ఉంటుంది. అయితే గుడ్ల ఒకరినొకరు ఇచ్చుకోవడం వల్ల మంచి రోజులు వస్తాయని వీరి నమ్మకం.
ఈస్టర్ ఆదివారం ప్రత్యేకతలు..
క్రైస్తవులు ఈస్టర్ డేను సంతోషకరమైన రోజుగా భావిస్తారు. ప్రజల్లో మార్పు రావడానికి ఈస్టర్ ఆదివారం ఎంపిక చేసుకుంటారంట. చెడు అలవాట్లను ఈ రోజు నుంచి మార్చుకోవాలని అనుకుంటారంట. తప్పులను సరిదిద్ది.. సన్మార్గంలో నడిచే అవకాశాన్ని కల్పించమని యేసు ప్రభువును వేడుకుంటారు. యేసును సిలువతో హింసించినందుకు పశ్చాత్తాప పడుతారని, అందుకే ఈస్టర్ ఆదివారం రోజు కొవ్వొత్తులు వెలిగించుకుని తమ భక్తి, విశ్వాస్వాన్ని, నివాళి తెలుపుతారు. చర్చిని, తమ ఇళ్లలను అందంగా అలంకరించుకుని కొవ్వొత్తులు వెలిగించుకుంటారు.